23.4 C
Hyderabad

డిసిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

14-day remand for DCSO Srikanth Reddy

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బడా మిల్లర్ ను కూడా రిమాండ్ కు పంపిన కోర్టు

. . . ముగిసిన మరికొందరు మిల్లర్ల సిఐడి కస్టడీ

. . . రేపో మాపో సిఐడి విచారణకు సివిల్ సప్లై అధికారులు

 నిజామాబాద్, బతుకమ్మ:

కస్టం మిల్లింగ్ రైస్ కుంభకోణం తో పాటు, ఎఫ్ సిఐ కి సన్నబియ్యం కు బదులు దొడ్డు బియ్యం అంటగట్టిన కేసులో అరెస్టైన నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీకాంత్ రెడ్డి కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సిఐడి అధికారులు డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా రిమాండ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. డిసిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సెలవులో ఉండగానే సిఐడి విచారణ జరగడం, వారు ఇచ్చిన ఆధారాలతో ఆయనను సస్పెండ్ చేస్తు రాష్ట్ర కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. సిఐడి కస్టడీలో ఉన్న ముగ్గురు మిల్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ప్రముఖ విద్యా రైస్ మిల్ యజమాని కిషోర్ ఇనానీ అరెస్ట్ చేసి జడ్జీ ముందు ప్రవేశపెట్టగా అతనికి కూడా 14 రోజుల రిమాండ్ కు తరలించారు. గత నెల 29న సిఐడి అధికారులు  విచారణ నిమిత్తం కోర్టు అనుమతి తో తీసుకున్న ముగ్గురి మిల్లర్ల కష్టడి ముగిసింది. అదివారం వారిని తిరిగి జైలుకు పంపించారు. ఈ కేసులో ఇప్పటికే 6 గురు మిల్లర్ల పై కేసులు నమోదు కాగా 4 అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముగ్గురు బెయిల్ పోందగా ముగ్గురిని అధికారులు విచారించారు.

14-day remand for DCSO Srikanth Reddy

తాజాగా సి ఎం ఆర్ బకాయిల కేసులతో పాటు మిల్లులను తనిఖీలలో నిర్లక్ష్యం, ఎఫ్ సిఐ కి సి ఎం ఆర్ అప్పగింతలో సర్టిఫై చేసిన వ్యవహరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అదికారి  శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక డిఎం తో పాటు ఇతర అధికారులను విచారించే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ లు పూర్తయిన తరువాత కోర్టు అనుమతితో కస్టడీ కోరే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 54 మంది మిల్లర్ల నుంచి రావాల్సిన సి ఎం ఆర్ బకాయిల కోసం సిఐడి ని ప్రభుత్వం రంగంలోకి దించడంతో జిల్లాలో రైస్ మిల్లర్లు అజ్ఞాతంలోకి వేళ్లిపోయారు. అందులో చాల మంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అశ్రయించగా అ కేసు సోమవారం విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు తీర్పు కోసం అటు  ప్రభుత్వంతో పాటు సిఐడి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కోర్టు తీర్పు ప్రకారం మిల్లర్లు చర్యలకు సిఐడి సిద్ధమైంది. సిఐడి విచారణ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖలో మరి కొంత మంది అధికారుల సీట్లకు ఎసరు వచ్చే అవకాశం ఉంది.

More articles

Latest article