రాజీ మార్గమే రాజా మార్గం

0 9,697

 

. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య

 

. . . జాతీయ లోక్ అదాలత్ లో 5662 కేసుల పరిష్కారం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాజీ మార్గమే రాజా మార్గం అని, క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గత నెల రోజుల నుండి శనివారం వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ రకాల 5662 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో 7 కమీషనరేట్ ల పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు,  ప్రతి జిల్లాలో డీ4సీని ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో 134 సైబర్ క్రైమ్ కేసులలో రూ.31,82,649 లను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వై.వెంకటేశ్వర్ రావ్, సీఐ ముఖిద్ పాషా, సీసీఆర్ బి సీఐ అంజయ్య, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.