. . . కారులో దోరికిన తల్వార్ లు, కత్తులు
. . . పరారైన గంజాయి సూత్రదారీ రోడ్డ అప్పు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలిస్ లకు పాత నేరస్థులు మస్కా కోట్టి పరారి అయ్యారు. పోలిస్ లు వాహనాలు తనిఖీ చేస్తుండటంతో తమ కోసం గాలిస్తున్నారని అందులో ఉన్న ముగ్గురు పాత నేరస్థులు పరారీ కాగా ఇద్ధరిని పట్టుకున్నారు. కారులో తల్వార్ లు, కత్తులను చూసి షాక్ కు గురయ్యారు పోలిస్ లు, పరారీ అయిన వారికోసం గాలింపు చర్యలు చెపట్టారు. నగర శివారులోని ప్రధాన రహదారిపై సౌత్ రూరల్ సర్కిల్ పరిధిాలోని ఒ పోలిస్ స్టేషన్ కు చెందిన పోలిస్ లు సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అప్పుడే అదే రోడ్డులో వస్తున్న స్వీప్ట్ కారులో ఐదుగురు యువకులు ఉండగా వారంతా మద్యం సేవించి ఉండటంతో వారికి పాత నేర చరిత్ర ఉండటంతో పోలిస్ లుఎక్కడ పట్టుకుంటారోనని కారుదిగి ముగ్గురు పరారీ అయ్యారు. అందులో ఉన్న ఇద్ధరిని అదుపులోకి తీసుకున్న పోలిస్ లు రాత్రి వారి కోసం జల్లేడ పట్టారు. కారులో బర్సాత్ అమేర్ అనే రౌడిషీటర్ తో పాటు ఇటివల గంజాయి కేసులో ఎక్సైజ్ తో పాటు పోలిస్ లు గాలీస్తున్న ఖిల్లా ప్రాంతానికి చెందిన అప్రోజ్ అలియాస్ రోడ్డ అప్పుతో పాటు ఒ రౌడిషీటర్ హత్య కేసులో వారంటు పెండింగ్ లో ఉన్న మరో పాత నేరస్థుడు ఉన్నారని పోలిస్ లు అను మాని స్తున్నారు. బర్సాత్ అమేర్ ఇటివల జైలు నుంచి విడుధల అయ్యాడని, అప్రోజ్ ఇటివల గంజాయి దందాలో కీలకంగావ్యవహరిస్తు నేట్ వర్క్ విస్థరించడంతో అతని కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో కారులో కత్తులు, కటార్లతో పోలిస్ లకు దోరికిన తమను అరెస్టు చేసి కట కటాల్లోకి నేడుతారని వారు కారు వదిలి పరారీ అయినట్లు సమాచారం. అప్రోజ్, బర్సాత్ అమేర్ లు చిరకాల మిత్రులు కాగా మరో పాత నేరస్థుడు బర్సాత్ అమేర్ తో కలిసి జంగల్ ఇబ్బు హత్య కేసులో నిందితుడు అని ప్రచారం జరుగుతుంది. పరారీలో ఉన్న ముగ్గురు దోరికితే గాని విషయం బయటకు తెలియని పరిస్థితి.
