29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

 మోర్తాడ్ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఎన్ఎస్ఎస్ డే

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్ , బతుకమ్మ:                                                                                                                                  

మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ నినాదం నాట్ మీ బట్ యు కాబట్టి వాలంటర్లు సమాజసేవలో పునరంకితం అవ్వాలి అని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వరదలు భూకంపాలు వంటివి వచ్చినప్పుడు వాలంటీర్ల సేవలు అభినందనీయం. జాతీయ సమైక్యతకు ఎన్ఎస్ఎస్, ఎన్ సీ సీ కృషి చేస్తుంది అన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని ఎన్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. మోర్తాడ్ డిగ్రీ కళాశాల వాలంటీర్లు స్వచ్ఛతహి సేవలో పాల్గొన్నందుకు అభినందించారు .ఎన్ఎస్ఎస్ పిఓ వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి మాట్లాడుతూ 1969 సంవత్సరం సెప్టెంబర్ 24న గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రారంభమైందని విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములను చేయుట దీని లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.వాలంటీర్లు పచ్చదనం పరిశుభ్రత నిర్వహించారు.

NSS Day was celebrated at Mortad Degree College

More articles

Latest article