24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రముఖ సామాజికవేత్త కొట్టూర్ చంద్రకాంత్ కి  సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ                                                                                                                                                     

ప్రముఖ సామాజికవేత్త, బీసీల అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న, బీసీ కులాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ లు కావాలని పోరాడుచున్న కొట్టుర్ చంద్రకాంత్ ను తెలంగాణ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బాల్యపు దుర్గారావు, కార్యదర్శి కీర్తి యుగేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.  మేరు సంఘానికి సేవ చేస్తూ, బి సి ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాక సామజిక కార్యక్రమాలలో తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొట్టుర్ చంద్రకాంత్ సేవలు ఎనలేనివని అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ బి సి చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ ల సమక్షంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్సఫ్రాక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, లు చంద్రకాంత్ ని సన్మానించారు. సభలో రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ డా. రియాజ్ , హస్తకళ అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మహిళా కమిషన్ మెంబెర్ శ్వేత ఐలమ్మ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article