. . . తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 18(బుధవారం) హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల కు సంబంధించి వారు జిపిఎఫ్ ప్రోవిడెంట్ ఫండ్ లో దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వటం లేదని, ఇది చాలా దుర్మార్గమని వారు తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శిర్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ, డివిజన్ అధ్యక్షులు రాధా కిషన్, కార్యదర్శి సాంబశివరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ హమీరుద్దీన్, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాజేశ్వరరావు, మదన్ మోహన్, లక్ష్మీనారాయణ, లలిత తదితరులు ఉన్నారు.
