- క్రమంగా తగ్గుతున్న ఎస్సార్ ఎస్పీ సామర్థ్యం
- 32 టీఎంసీల నిలువ సామర్థ్యం పడిపోయి..
బతుకమ్మ,మెండొరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని తెలపడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ జిల్లాలను పంటలతో సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక సమస్య వెంటాడుతుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుత కాలంలో పూడిక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఒక ముప్పుల వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణ దశలో 112 టీఎంసీల సామర్థంతో నిర్మించారు. కాగా ప్రస్తుతం 80.5 టిఎంసిలకు పడిపోయింది. అంటే 32 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం పడిపోయింది. ఎక్కువ ప్రాంతాల నుంచి ఉదృతంగా ప్రవహిస్తూ వస్తున్న వరదల కారణంగా దశాబ్ద కాలంగా వస్తున్న పూడిక పేరుకుపోయి క్రమక్రమంగా ప్రాజెక్టు సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. పూడిక వలన రానున్న రోజుల్లో ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నిపుణులు అధికారులు నాయకులు ప్రాజెక్టు పూడిక నువ్వు తొలగించి నీటి సామర్థ్యం పెంచితే రైతులకు ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎటువంటి డోకా లేదని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ లోకి ఇన్ ఫ్లో 289 టిఎంసి గా నీరు వచ్చి చేరింది. కాగా వరద గేట్ల ద్వారా 108 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 9 టీఎంసీలు, ఆయకట్టుకు 101 టీఎంసీలు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 49 టీఎంసీలు ఆవిరూపంలో 12 టీఎంసీలు త్రాగు అవసరాలకు 6 టిఎంసిల నీటిని వినియోగించారు. 2005 నుంచి చూసుకుంటే ప్రాజెక్టులో కింది పట్టిక ఆధారంగా తక్కువ నీటి నిలువ సామర్థం కనబడుతుంది.
- సంవత్సరం నెల కెపాసిటీ
2005 జూన్ 3.7 టీఎంసీ
2006 జూన్ 6.6 టిఎంసి
2009 జూన్ 3.6 టిఎంసి
2010 జూన్ 4.3 టిఎంసి
2012 జూన్ 6.9ఎంసి
2015 జూలై 6.7 టిఎంసి
2016 జూన్ 4.5 టిఎంసి
2018 జూన్ 6.5 టిఎంసి
2019 జులై 5.2 టిఎంసి
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శనివారం 1060.80 అడుగులు, 11.335 టిఎంసిల నీరు నిల్వ ఉంది. దీనిలో డెడ్ స్టోరేజ్ 5 టిఎంసిలు పోను మిగిలేది కేవలం 6.335 టీఎంసీలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రాజెక్టులో పూడికను తీసే విధంగా చర్యలు తీసుకుంటామని దానికి సంబంధించిన వివరాలను గతంలో సంబంధిత అధికారుల నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం.
- ఉన్నతాధికారుల దృష్టికి..
- శ్రీనివాస్ గుప్తా, ఎస్ ఈ (ఎస్సారెస్పీ).
ప్రాజెక్టులో పూడిక విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆదేశాలనుసారంగా పనులు చేయడం జరుగుతుంది.

