పోక్సో కేసు విత్ డ్రా చేసుకుంటేనే బాలికను వదులుతా
తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరిస్తున్న కిడ్నాపర్
కేసు నమోదుకు పరిమితమైన పోలీస్ లు
నాలుగు రోజులుగా ఆచుకి కోసం తల్లిదండ్రుల ఆవేదన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈ నెల 19న రాత్రి నగరంలోని ఖలీల్ వాడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోయిన పో క్సో బాధితురాలు కిడ్నాప్ కు గురైంది. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే బాలికపై గతంలో అత్యచారం చేసిన వ్యక్తియే , పోక్సో కేసును విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ తో మైనర్ ను కిడ్నాప్ చేశారు. బాధితుల పిర్యాదు మేరకు నగరంలోని 20న ఒకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన విషయం స్థానిక ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లోని ఒ ఎఏస్ఐ, ఆరవ టౌన్ పోలిస్ స్టేషన్ లో కానిస్టెబుల్ లు ఇద్ధరు కుడా కిడ్నాప్ చేసిన వ్యక్తికి ఈ విషయం ఉప్పధించారు. దానితో బాలికపై అత్యచారం చేసిన కేసులో పోలిస్ లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి ఈ సారి బాలికను కిడ్నాప్ చేసి తనపై తల్లిధండ్రులు పెట్టిన కేసును ఉప సంహరించుకోవాలని బ్లాక్ మేయిల్ కు దిగాడు. ఈ మేరకు మైనర్ బాలిక తండ్రికి పోన్ చేసి బేదిరింపులకు దిగాడు. నిజామాబాద్ నగర పోలిస్ లు గతంలో బాలికపై అత్యచారంకు సంబందించి బాధ్యుడిని అరెస్టు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తల్లిధండ్రులు వాపోతున్నారు. బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసిన తరువాత పోలిస్ లు బిజీగా ఉండటంతో కిడ్నాపర్ డైరెక్టుగా తల్లిధండ్రులకు పోన్ చేసి పోక్సో కేసును విత్ డ్రా చేసుకుంటేనే అప్పటివరకు తనకు ఎమి కాదని చెప్పడం విశేషం.
Next Post