మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని పెద్ద బజార్ లో ఆదివారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సర్వే కార్యక్రమంలోపాల్గొన్నారు. సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ లిస్టులలో పేర్లు లేనివారిని గుర్తిస్తూ ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటును వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా ఓటర్ లిస్టులో పేర్లు నమోదు కాని ఓటర్లు ఎవరైనా ఉంటే చేసుకోవాలని, సంబంధిత అధికారులను కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. దేశంలో ఓటు అన్నది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని పోలింగ్ రోజున ఓటు హక్కు ఉన్నవారు ఎన్ని పనులు ఉన్నా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
