28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

షబ్బీర్ ఆలీని కలిసిన నిఖత్ జరీన్

Must read

📰 Generate e-Paper Clip

డీఎస్పీ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు
నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా నియమించిన మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ సలహదారు మొహమ్మద్ ఆలీ షబ్బీర్ ని కలిసింది. ఆదివారం షబ్బీర్ ఆలీని కలిసి డీఎస్పీ గా నియమించి నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన నియామకాన్ని పొందడంలో షబ్బీర్ అలీ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి విజన్‌ అభినందనీయమన్నారు. ఒలింపిక్ స్థాయి అథ్లెట్లను తయారు చేసేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు ప్రపంచ స్థాయి క్రీడా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ కోచ్‌లను తీసుకువస్తామని ఆయన చెప్పారు.

More articles

Latest article