26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

గతంలో మాదిరిగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ప్రభుత్వమే చెల్లించాలని దొoచంద, తాళ్లరాంపూర్, భట్టాపూర్, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ లు ఏర్గట్ల ఎంపీఓ శివ చరణ్ ను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధుల నుండి పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం వలన జిపి లో నిధులు లేక ప్రజా సమస్యలు తీర్చడంలో సర్పంచ్ లుగా మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా గ్రామపంచాయతీ కార్మికుల జీతాలను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, దొంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బట్టపూర్ సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు.

More articles

Latest article