బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఇన్ చార్జ్ మున్సిపల్ కమిషనర్ హాయ్యుమ్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయ బాలరాజ్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ సాగింది. నామినేషన్ లు వేసిన నలుగురు కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు ఏకగ్రీవంగా, ఒకరు ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా కాసుల రోహిత్, ఖమర్ సుల్తానా గౌస్, ఉల్లవ్వ, ఓటింగ్ ద్వారా మొహమ్మద్ మజీద్ ముజ్జు ఎన్నికయ్యారు. మైనారిటీ కోటాలో కాంగ్రెస్ తరఫున మొహమ్మద్ మజీద్ ముజ్జు నామినేషన్ వేయగా, బీజేపీ నాయకుడు రాజాసింగ్ పోటీ చేయడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్ కు చెందిన 11 మంది, ఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు మద్దతు పలికారు. దీంతో 13 ఓట్లతో ముజ్జు విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన వారిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
