గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలి
ఏర్గట్ల, బతుకమ్మ : గతంలో మాదిరిగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ప్రభుత్వమే చెల్లించాలని దొoచంద, తాళ్లరాంపూర్, భట్టాపూర్, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ లు ఏర్గట్ల ఎంపీఓ శివ చరణ్ ను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధుల నుండి పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం వలన జిపి లో నిధులు లేక ప్రజా సమస్యలు తీర్చడంలో సర్పంచ్ లుగా మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా...