24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజాకోర్టులో ప్రభుత్వానికి శిక్ష తప్పదు

Must read

📰 Generate e-Paper Clip

ఇంద్రవెల్లి, బతుకమ్మ: ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి కవిత సోమవారం నివాళులు అర్పించారు. ముందుగా నేరడిగొండలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకోగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఆమె ఇంద్రవెల్లికి చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ.12వేలకు తగ్గించి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాష్ర్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు భయపడుతున్న ప్రభుత్వం తమ శ్రేణులను అక్రమ కేసులతో వేధిస్తోందని, ఇందులో భాగంగానే ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

More articles

Latest article