ప్రజాకోర్టులో ప్రభుత్వానికి శిక్ష తప్పదు

ఇంద్రవెల్లి, బతుకమ్మ: ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి కవిత సోమవారం నివాళులు అర్పించారు. ముందుగా నేరడిగొండలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకోగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఆమె ఇంద్రవెల్లికి చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....