30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగుల హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఉద్యోగుల హక్కులు, అవసరాలు పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. టిఎన్జీవోస్ ఎల్లారెడ్డి తాలూకా ఆధ్వర్యంలో మంగళవారం టీఎన్జీవోస్ ఎల్లారెడ్డి తాలూకా కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు నరాల వెంకట్ రెడ్డి, ముల్క నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్యాలయ భవనం నిర్మాణం ఎంతో అవసరమని అన్నారు. త్వరలోనే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు, అవసరాలు పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు యొక్క కృషి మరువలేనిదని అన్నారు. ఎల్లారెడ్డి భవన ప్రారంభోత్సవానికి వారి యొక్క తోడ్పాటు చాలా గొప్పదని అన్నారు. అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల కృషి కై ప్రభుత్వంతో చర్చించవలసిందిగా ఎమ్మెల్యే ని కోరారు. ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు ఎల్.మహిపాల్ మాట్లాడుతూ మదన్ మోహన్ రావు ఎల్లవేళలా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటూ ఎనలేని సేవలను అందిస్తున్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై వారి యొక్క కృషి, తోడ్పాటు మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా కోశాధికారి ఎం దేవరాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ చక్రధర్, జిల్లా ఉపాధ్యక్షులు  యు.సాయిలు, శ్రావణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఈసి మెంబర్ దత్తాత్రే, కామారెడ్డి అర్బన్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, సృజన్ రెడ్డి, కోశాధికారి పవన్, దోమకొండ తాలూకా అధ్యక్షులు సంతోష్ కుమార్, మద్నూర్ తాలూకా అధ్యక్షులు కే పవన్ కుమార్, బాన్సువాడ తాలూకా కార్యదర్శి అజీముద్దీన్, ఎల్లారెడ్డి అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్, కార్యదర్శి వి. శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్-I జి.రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్-II జై.శ్రీకాంత్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ జె. వసంత లక్ష్మి, జాయింట్ సెక్రెటరీ-I ఎన్.సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ-II అభినవ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఉమెన్ డి. స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.కృష్ణ, పబ్లిక్ సెక్రెటరీ శంకరయ్య, ఈసీ మెంబర్-I ప్రశాంత్ కుమార్, ఈసీ మెంబర్-II బి.శారద, ఈసీ మెంబర్-IIl శరత్ చంద్ర ప్రసాద్, ఈసీ మెంబర్- IV ఎం.రవీందర్,ముఖిద్, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

The government is committed to employee rights.

More articles

Latest article