27.4 C
Hyderabad

మండల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఇన్ చార్జి మసాయి పేట యాదగిరి మాదిగ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సెప్టెంబర్ 9 లోగా జిల్లాలోని అన్ని మండలాల కమిటీల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఇన్ చార్జి మసాయిపేట యాదగిరి మాదిగ అన్నారు. నగరంలో సరికేల పోశెట్టి మాదిగ అధ్యక్షతన శుక్రవారం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల ఇన్‌చార్జిల నియామకం, వారి పని విధానం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు సూచించారు. మండల స్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు గంధమల్ల నాగభూషణం మాదిగ, మంద ప్రభాకర్ మాదిగ, తెడు గంగారాం మాదిగ, నాగం రాజేష్ మాదిగ, లసింగారి భూమయ్య, సోంపురి పోచయ్య మాదిగ, రోడ ప్రవీణ్ మాదిగతో పాటు మహిళా సమాఖ్య నాయకులు యమున మాదిగ, గుంటా పద్మ మాదిగ, ఏసిరెడ్డి సత్యక తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article