27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ జిల్లాలో నామినేటేడ్ పోస్టుల భర్తీ పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆశవహులకు రెండేళ్ల నిరీక్షణ తప్పదా
  • జిల్లా, నగర కాంగ్రెస్ పోస్టులు త్వరలో భర్తీ
  • దసరాకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అశలు లేనట్టే
    నిజామాబాద్, బతుకమ్మ: దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతల పదవుల పందేరానికి తెరపడిందా అంటే అవుననే చెప్పాలి. నిజామాబాద్ జిల్లా కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కేశ వేణుకు నుడా చైర్మెన్, అంతరెడ్డి రాజారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లు గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో పదవుల పంపకానికి బ్రేక్ పడినట్టే నని చర్చ జరుగుతుంది. సంబంధిత రెండు పధవులపై పేచి ఉండగా వాటికి రూట్ క్లీయర్ చేస్తు ఆదేశాలు రావడం అందుకు కారణం. అంతరెడ్డి రాజారెడ్డి సుధర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా నుడా చైర్మెన్ పదవిని ఆశించగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కేశ వేణు స్టేట్ కార్పొరేషన్ చైర్మెన్ ఆశించారు. ఐతే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు కేశ వేణు ఆశిస్తున్న స్టేట్ కార్పొరేషన్ చైర్మెన్ పదవిని ఇంకొక్కరికి వాగ్ధానం చేసామని, నుడా తీసుకోవాలని స్వయంగా సీయం రేవంత్ రెడ్డి సూచించడంతో నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ ఆథారీటి చైర్మెన్ పదవి తీసుకోక తప్పలేదు. అప్పటికే తన అనుచరుడు అంతరెడ్డి రాజారెడ్డికి ఆ పదవిని ఆపర్ చేసిన మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పదవికి సిఫారసు చేసిన ఉత్తర్వులు రావాడానికి సమయం పట్టింది. రెండు పదవుల విషయంలో ఊగిసాలాట ధోరణి పార్టీలో కొత్త చర్చకు దారీ తీసింది. రెండు పదవులపై ఈ నెల 9న ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేయడంతో ఈ చర్చ ముగిసిపోయింది.
    నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తోమ్మిది అసెంబ్లీ స్థానాలకు నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిన ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. జిల్లాలో ఇద్ధరు సీనియర్ లకు రాష్ర్ట ప్రభుత్వ సలహాదారులుగా నియామకాలు చేసి, ఐదుగురికి కార్పొరేషన్ చైర్మెన్ పదవులను కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ సంస్థల చైర్మెన్ ల నియామకాలు పూర్తి కాగా, మిగిలిన ఏకైక నుడాకు కుడా చైర్మెన్ గిరి ఎవ్వరికి ఇస్తున్నారో స్పస్టత వచ్చింది. మార్కెట్ కమిటీల చైర్మెన్ పోస్టుల భర్తీకుడా దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. ఒక్కటో, రెండో ఎఏంసీలు మినహ అన్ని మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు నియామకాలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాకు ఐదు స్టేట్ కార్పోరేషన్ చైర్మెన్ పదవులు రావడంతో ఇంకా స్టేట్ ఫదవులు రావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మార్క్ ఫెడ్ చైర్మెన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడం, రాష్ర్ట మైనార్టి కమీషన్ చైర్మెన్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 చైర్మెన్ పదవులు ఉన్నట్టైంది. ఇకా కార్పొరేషన్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే అని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి స్టేట్ కార్పొరేషన్ చైర్మెన్ పదవి దక్కడం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణుకు తాజాగా నుడా చైర్మెన్ పదవి దక్కడంతో ఆ పదవులను ఇతరులతో భర్తీ చేయనున్నారు.

More articles

Latest article