24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులను సూచించారు.  జిల్లా కలెక్టర్ శుక్రవారం  విద్యాశాఖ ఆధ్వర్యంలో  కామారెడ్డి పట్టణంలోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన  ఎఫ్ఎల్ఎన్  బోధనాభ్యాసన సామాగ్రి మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేళాను  ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి 250 మంది ఉపాధ్యాయులు  బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతారని అన్నారు. పిల్లలకు తరగతి గదిలో అభ్యసన సామగ్రి తప్పనిసరిగా వినియోగించి విద్యా పట్ల ఆకర్షితులను చేయాలని అన్నారు. విద్యార్థులు వినడం కంటే నమూనాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా అధికంగా నేర్చుకోగలుగుతారని  అన్నారు.చక్కటి ప్రదర్శనలను చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందిస్తు అ  పదవ తరగతి ఫలితాల్లో  జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్,  నాగవేందర్, రమణరావు, పరీక్షల కమీషనర్ బలరాం, డీసీఈబీ కార్యదర్శి లింగం,  ఎంఈవో లు ఎల్లయ్య, ఆనందరావు, రాజులు, యూసఫ్, రామస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

The district should be placed at a high level in the field of education.

More articles

Latest article