నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నీట్ పీజీ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 558వ ర్యాంకు సాధించిన డా. దీక్షితను గౌరవిస్తూ నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపల్స్ డా. నాగమోహన్, డా.జలగం తిరుపతి రావు, డా.కిషోర్‌కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్ మాట్లాడుతూ, “డా. దీక్షిత మన కాలేజీకి గర్వకారణం. ఆమె విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత, స్వీయ కృషి కారణమయ్యాయి” అని అన్నారు. ఆమె విజయం మిగతా విధ్యార్థులకు స్పూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్దేశించి “ప్రణాళికాబద్ధమైన చదువు, క్రమశిక్షణ, సమయపాలనతో నీట్ పీజీ పరీక్షలో విజయాన్ని సాధించవచ్చు” అని సూచించారు.
