జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలి

జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులను సూచించారు.  జిల్లా కలెక్టర్ శుక్రవారం  విద్యాశాఖ ఆధ్వర్యంలో  కామారెడ్డి పట్టణంలోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన  ఎఫ్ఎల్ఎన్  బోధనాభ్యాసన సామాగ్రి మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేళాను  ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి 250 మంది ఉపాధ్యాయులు  బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న...