24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాణం ఖరీదు రూ.8 లక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి
  • ప్రాణానికి వెల కట్టిన వైనం
  • ఆర్మూర్ లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యం ఓ వివాహిత ప్రాణాలను బలిగోరింది. పిల్లలు పుట్టడం లేదని మహిళ వైద్య నిపుణుల వద్ద వైద్యం చేసుకుంటే పిల్లలు కలుగుతారని సర్జరీ చేయించుకున్న మహిళ ఆసుపత్రిలోనే కన్నుమూసింది. మహిళ మృతి చెందగా వైద్యులు ఆ నేపాన్ని తమపై రాకుండా కాసులకు వెల కట్టారు. చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకోవడంతో వివాదాన్ని కప్పిపుచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పూర్వపు మోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన వ్యక్తి వివాహం జరిగింది. వారికి పిల్లలు కలుగకపోతే ఆర్మూర్ లో భార్యభర్తలు ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. భార్య స్త్రీ వైద్య నిపుణురాలిగా, భర్త ల్యాప్రోస్కోపి సర్జన్ గా ఉండడంతో అక్కడ ఈ నెల 24న వైద్యం చేయించుకుంది. కానీ సదరు వివాహిత ఆపరేషన్ థియేటర్ లోనే (ఆన్ బెడ్) పై కన్నుమూసింది. ఎక్కడ తమ ఆసుపత్రి పేరు దెబ్బతింటుందోనని వైద్యులు కాళ్ళబేరానికి వచ్చారు. ఇటీవలనే ఆసుపత్రి వార్షికోత్సవం పేరిట కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ల ప్యాకేజిని ప్రకటించగా వివాహిత మరణించడం చర్చనీయాంశంగా మారింది. మహిళ చనిపోగా ఆమె కుటుంబ సభ్యులతో రూ.8 లక్షలకు బేరం కుదుర్చుకుని సెటిల్ చేయడం విశేషం. చివరకు పోస్టుమార్టంను కార్డియాక్ అరెస్టుగా చెబుతున్నట్లు తెలిసింది. పేరుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అన్ని హంగుళతో పెట్టినప్పటికీ అనుభవ రాహిత్యమే మహిళ మృతికి కారణమనే తెలిసింది.

More articles

Latest article