27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పది పరీక్షలో చీటింగ్..

Must read

📰 Generate e-Paper Clip

  • ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయుల ఉరుకులాట
  • చీటింగ్ కు కేరఫ్ గా  కోటగిరి  హై స్కూల్
  • రేపటి పరీక్ష కోసం నేటి నుండే చిట్టీల ఏర్పాట్లు

 

కోటగిరి, బతుకమ్మ :  విద్యా బుద్దులు నేర్పే గురువులే తమ పాఠశాల ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం కోసం మండలం, జిల్లాలో  మంచి పేరు కోసం ఉరుకలు తీస్తున్నారు. ఇందుకు తోడుగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలు సైతం విద్యార్థుల నుండి వేలలో ఫీజులు వసూలు చేస్తూ సరైన బోధనలు అందించకుండా మండలంలో నంబర్ వన్ విద్యాసంస్థలుగా చెప్పుకొని అడ్మిషన్ లు పొందడం కోసం పదవ తరగతి విద్యార్థులతో చీటింగ్ కు పాల్పడుతున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  చీటింగ్ కు కేరఫ్ గా

Cheating in the 10th exam..

నిలుస్తుందనే  వార్తలు గట్టిగానే వినిపించడంతో సోమవారం జరిగిన పరీక్షకు జిల్లా విద్య అధికారి అశోక్ కుమార్ తనిఖీ చేసి సుమారు రెండు గంటల పాటు పరీక్ష కేంద్రంలోనే గడపడమే ఇందుకు నిదర్శనం.  పరీక్ష కేంద్రంగా మూడు ప్రైవేట్ పాఠశాలు, కస్తూర్బా గాంధీ, మైనారిటీ, కోటగిరి, ఎత్తోండ పాఠశాలలతో కలిపి ఏ, బి సెంటర్లు  322 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అటు జిల్లాలో ఇటు మండలంలో మంచి ఉత్తీర్ణత పొంది ఉన్న తాధికారుల మెప్పు పొందడం కోసం ప్రభుత్వ పాఠశాలు, మండలంలో మంచి ఉత్తీర్ణత శాతం పొంది ప్రైవేట్ విద్యా సంస్థలలో నంబర్ వన్ గా నిలిచి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం కోసం పోటీపడుతూ విద్యార్థులతో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనంగా పరీక్ష కేంద్రలోని గదుల కిటికీలు వద్ద మైక్రో జిరాక్స్ చేసిన చిట్టీలు పడి ఉండడం గమనార్హం. దీనితో పాటు బుధువారం జరిగే  గణిత శాస్త్రం  పరీక్షలకు సంబందించిన పుస్తకాలు పరీక్ష కేంద్రలోని  కిటికీ  వద్ద ముందుగానే ఉంచడం కొసమెరుపు.

Cheating in the 10th exam..

More articles

Latest article