25.8 C
Hyderabad

విజయ్ దంపతుల మధ్య వివాదానికి తెర

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తమిళనాడు సీఎం విజయ్, ఆయన సతీమణి సంగీత మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పడింది. విడాకుల కోసం సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసు విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, పిటిషన్‌ను కొనసాగించకపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించారు. తమ మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోయాయని ఆమె వెల్లడించినట్లు సమాచారం. గతంలో విజయ్ ఓ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంగీత కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ కేసు విచారణ సమయంలో విజయ్, సంగీత ఇద్దరూ ప్రత్యక్షంగా హాజరు కాలేదు. తాజాగా సంగీత తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయడంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు కేసును ముగించింది. ఈ పరిణామంపై విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.

More articles

Latest article