29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సాయిలు ఇటీవలే ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసుకోగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితునికి రూ. 60 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండల్వాడి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట సంగయ్య, నెరుగంటి బాలరాజ్, శంకర్, షాదుల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article