. . . రెండు చుక్కలే వారి భవిష్యత్తుకి నాంది
. . . సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండాలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఇందల్వాయి తండా సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు బాదవత్ సుదర్శన్ నాయక్, ఇందల్వాయి గ్రామంలో సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో రోగనిరోధక టీకాల కార్యక్రమాన్ని ఇంత గ్రామాల సర్పంచులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారుల జీవితాలలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గ్రామాలలోని ఇంటింటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి సేవలు అందించాలన్నారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందరు తల్లిదండ్రులు నిరక్షంగా వ్యవహరిస్తూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించకపోవడం పట్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందడం అత్యంత అవసరమని అన్నారు.ఆరోగ్య శాఖ అధికారులు,ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇందల్వాయి తాండ ఉప సర్పంచ్ బాలు, వర్మ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
