బతుకమ్మ, కోటగిరి : తెలంగాణా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని అందుకే తొమ్మిది రోజుల్లో రైతులకు రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు ఇచ్చి చరిత్ర సృష్టించిందని అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ… రైతులకు ఇస్తామని రైతు భరోసా కేవలం తొమ్మిది రోజుల్లో ఇచ్చిన ఘనత దేశంలో కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500 ల బోనస్ ఇస్తున్న ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేని చెప్పారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు,సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు,మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కిసాన్ ఖేత్ మండలాధ్యక్షుడు ఆనంద్,నాయకులు బర్ల మధు,తేల్ల రవి,అనిల్ కులకర్ణి,దొప్పల పూడి శ్రీధర్,అఫ్జల్,అబ్బయ్య,నజీర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.