24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి జిల్లాల ఎడ్యుకేషనల్ హబ్ గా విశ్వవిద్యాలయాన్ని మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ నాయకులు, తెయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పంచారెడ్డి చరణ్

 

నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాల ఎడ్యుకేషనల్ హబ్ గా విశ్వవిద్యాలయాన్ని మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పంచరెడ్డి చరణ్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పంచరెడ్డి చరణ్ మాట్లాడుతూ …దశాబ్ద కాల ఉమ్మడి నిజామాబాద్ ప్రజల వాంఛ  అయినటువంటి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు పట్ల  సానుకూలంగా స్పందించి విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి అలాగే విశ్వవిద్యారానికి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేపించడంలో కీలక పాత్ర పోషించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. మొదటి నుండి జిల్లాలో ఉన్నత విద్య అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను స్థాపించిందని అందులో భాగంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ తో పాటు జిల్లాలో తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించిందని ఆయన అన్నారు. 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటైన తెలంగాణ విశ్వవిద్యాలయం 2014 వరకు అభివృద్ధిలో పరుగులు పెట్టిందని కానీ 2014 నుండి దాదాపు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని మళ్లీ ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వంలో విశ్వవిద్యాలయంలో అభివృద్ధి కి అడుగులు పడుతున్నాయని అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాలలో మంజూరు చేసిందని ఆయన అన్నారు. తాము ఎన్ఎస్ యు ఐ విద్యార్థి విభాగంలో పని చేసినప్పటి నుండి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయానికి కావాల్సిన మౌలిక  వసతులు కల్పించారని గుర్తు చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారి నియోజకవర్గంలో విశ్వవిద్యాలయం ఉన్నందున విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్క ళాశాలను తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించారని ఇంజనీరింగ్ కళాశాల అంశాన్ని పలుమార్లు రేవంత్ రెడ్డి కి గుర్తు చేస్తూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీ.వీ.యు.వి  కార్యనిర్వహక అధ్యక్షుడు లాల్ సింగ్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు జైత్ రామ్, టి ఎస్ ఎఫ్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షుడు అష్రఫ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, మీరాన్ అలీ, అజయ్, సుభాష్, కౌశిక్, సాయి, తేజ, పవన్, సాయి, సోను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article