24 C
Hyderabad
Sunday, August 2, 2026

వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ
  • ఏడవ రోజుకు చేరిన నిరసన దీక్ష

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు మంగళవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కిందే మాదిగలను మోసం చెయ్యడానికి అన్నట్లు ఉందన్నారు. ఎందుకంటే ఆగస్టు 1 నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఒకవైపు స్వాగతిస్తునే ఇంకో వైపు డీఎస్సీ ఫలితాలు విడుదల చెయ్యడం జరిగిందన్నారు. డా. షమిం అక్తర్ ని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా నియమించి, రిపోర్ట్ తీసుకొని అది శాస్త్రీయంగా లేదని మంద కృష్ణ మాదిగ నుంచి వినతి వస్తె మళ్ళీ ఒక నెల రోజులు గడువు పెంచి మళ్ళీ అదే రిపోర్ట్ ను యధాతధంగా పెట్టడం అంటే మాదిగలను మోసం చెయ్యడమే అవుతుందని అన్నారు. ఆ తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో మార్చ్ 12 న వర్గీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పరన్నారు. ఆ తర్వాత మాల సంఘాలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని, ఆర్పీఐ అధ్యక్షులు, ఎంపీ రాందాస్ హతవలెని కలిసి వర్గీకరణ చట్టాన్ని తెవొద్దు అని చెప్పడంతో అలాగే సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డా. షమిం అక్తర్ రి రిపోర్టును రద్దు చెయ్యాలని వినతి పత్రం ఇచ్చారని అన్నారు. అందుకే మార్చ్ 12 న రావాల్సిన బిల్లు మార్చ్ 17 కు జరిగిందన్నారు. ఆ తర్వాత మార్చ్ 18 నాడు బిల్లు పెడుతామని కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇలా ప్రతి సారి మాదిగ సమాజాన్ని మోసం చేస్తే మాదిగలు ప్రభుత్వానికి దూరం అవుతారని హెచ్చరించారు. ఇందులో కొంత మంది మాదిగ జాతి ద్రోహులు చేరి మాదిగ జాతిని అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, సత్తెక్క, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఎంఎస్  జిల్లా నాయకురాలు రొడ్డ స్వప్న మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులు ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article