. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిడ్నాపైన బాలుడు మణికంఠ ఆచూకీ మహారాష్ర్టలోని నాందెడ్ జిల్లాలో లభ్యమైంది. బాలుడు సేఫ్ అని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముగ్గురు మహిళలు శుక్రవారం అర్ధరాత్రి బాలుడు మణికంఠను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం బాలుడి తండ్రి రాజు ఫిర్యాదుతో ఒకటో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ రికార్డు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుడి ఆచూకీని నాందెడ్ జిల్లాలో కనిపెట్టారు. అక్కడి నుంచి బాలుడితోపాటు మహిళలను నిజామాబాద్ కు తరలిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
