28.8 C
Hyderabad
Monday, August 3, 2026

అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టిన బైక్

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరి మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు
  • కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బతుకమ్మ, ముప్కాల్ :  బైక్ లో పెట్రోలు పోయించుకోవడం కోసమని ముగ్గురు స్నేహితులు ఒకే బైక్ పై పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ కు డీకొట్టి ఒకరు మృతి చెందిన ఘటన గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది. ఎస్సై రజీనీకాంత్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు స్నేహితులు బొల్లి సన్ని, అన్నేపాక గోపి, చెన్నూరు అరవింద్ లు బైక్ లో పెట్రోల్ పోయించుకోవడానికని బైక్ పై ఆర్దరాత్రి పెట్రోల్ పంప్ కు వెళ్లారు.బైక్ లో పెట్రోల్ పోయించుకుని తిరిగి ముప్కాల్ కు ఎన్. యచ్ హైవే 44 పై వస్తుండగా మండల కేంద్రం శివారులోని లక్ష్మి కెనాల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ కు డికొట్టింది.అన్నేపాక గోపి నడుపుతున్న AP 01AA 9720 బైక్ డివైడర్ కు డికొట్టడం తో ముగ్గురు కింద పడిపోయారు. దాంతో బైక్ నడుపుతున్న గోపీకి, సన్నికి తలకు తీవ్ర గాయాలు అవ్వగా,అరవింద్ కు నడుము భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సు లో నిర్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు.చికిత్స పొందుతూ తలకు గాయాలు అయిన బొల్లి సన్నీ అదే రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. గోపి, అరవింద్ లు అక్కడే చికిత్స పండుతున్నారు. ముప్కాల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

More articles

Latest article