26.8 C
Hyderabad

ఇందల్వాయి పెద్ద చెరువు అలుగెల్లింది

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో  పెద్ద వాగు,చిన్న వాగు  వర్షపు నీరుతో నిండుకుండలా పారడంతో  అలుగు పొంగిపొర్లుతుంది. దీంతో గ్రామంలో జలకళ సంతరించుకుంది.గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈసారి ఇందల్వాయి పెద్ద చెరువు తొందరగా నిండినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు.ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు నిండడం వల్ల  ఇందల్వాయి నుండి రామడుగు ప్రాజెక్టు వరకు వరద నీరు వెళుతుందని గ్రామస్తులు తెలిపారు.అలాగే ఏడు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరానుందని తెలుపుతున్నారు.చెరువు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు అంటున్నారు.మరో 24 గంటలలో అలుగు ఉదృతంగా పారే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారుఅలుగు పారడంతో  గ్రామస్తులు వీక్షించడానికి వెళ్తున్నారు.దీంతో  వీక్షించడానికి వెళుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article