ఇందల్వాయి పెద్ద చెరువు అలుగెల్లింది
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో పెద్ద వాగు,చిన్న వాగు వర్షపు నీరుతో నిండుకుండలా పారడంతో అలుగు పొంగిపొర్లుతుంది. దీంతో గ్రామంలో జలకళ సంతరించుకుంది.గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈసారి ఇందల్వాయి పెద్ద చెరువు తొందరగా నిండినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు.ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు నిండడం వల్ల ఇందల్వాయి నుండి రామడుగు ప్రాజెక్టు వరకు వరద నీరు వెళుతుందని గ్రామస్తులు...