22.7 C
Hyderabad

మద్నూర్‌లో విద్యా విప్లవానికి నాంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులపై ఉన్నత స్థాయి పరిశీలన

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బుధవారం స్వయంగా పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

 

The beginning of an educational revolution in Madnur

 

నిర్మాణ నాణ్యతపై రాజీపడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాలను అందించాలని ఆదేశించారు. ఈ స్కూల్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు నగర స్థాయి సదుపాయాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వారు వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మద్నూర్ ప్రాంతంలో విద్యా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

The beginning of an educational revolution in Madnur

More articles

Latest article