25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగర మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై దాడి చేసిన షేక్ రసూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. శేఖర్ పై హత్యాయత్నాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు నీలగిరి రాజు, కరిపె రాజు, గాండ్ల లింగం, రంగు సీతారం తదితరులున్నారు.

 

More articles

Latest article