27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

Must read

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, బతుకమ్మ :  మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలను  అధికారులు తొలగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలను అటవీ శాఖ అధికారులు  ధ్వంసం చేస్తున్నారు.  మూడు జేసీబీలతో 80 ఎకరాల పంటను   300 మంది ఫారెస్ట్ సిబ్బంది ధ్వంసం చేశారు. 16 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.  మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో  పోడు రైతులు వాగ్వాదానికి దిగారు.  నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై పోడు రైతులు దాడి చేసి, వారి కళ్లలో కారం చల్లారు.

More articles

Latest article