23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ ను సందర్శించిన తెలంగాణ మొదటి లోకాయుక్త

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లోని ఆచన్ పల్లి వాస్తవ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ మొట్టమొదటి లోకాయుక్త వెంకట రాములు బోధన్ ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తన మిత్రులను, బంధువులను ఆత్మీయంగా కలిసారు. నాటి మధుర జ్ఞాపకాలను బంధుమిత్రులతో పంచుకున్నారు. ఆయన బసవతారక నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆచన్ పల్లిలో  గల హనుమాన్ మందిరాన్ని, శక్కర్ నగర్ లో గల శ్రీరామ మందిరాన్ని బోధన్ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంను, భవాని ఎల్లమ్మ మందిరాన్ని సందర్శించారు. ఏక చక్రేశ్వర శివాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మహేష్ పాఠక్ చే శాస్త్రోత్తంగా ఆహ్వానం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి వారి పాలక మండలి తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, జిల్లా, బోధన్ న్యాయ సముదాయాల ప్రముఖులు పాల్గొన్నారు.

More articles

Latest article