బోధన్ ను సందర్శించిన తెలంగాణ మొదటి లోకాయుక్త
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లోని ఆచన్ పల్లి వాస్తవ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ మొట్టమొదటి లోకాయుక్త వెంకట రాములు బోధన్ ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తన మిత్రులను, బంధువులను ఆత్మీయంగా కలిసారు. నాటి మధుర జ్ఞాపకాలను బంధుమిత్రులతో పంచుకున్నారు. ఆయన బసవతారక నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆచన్ పల్లిలో గల హనుమాన్ మందిరాన్ని, శక్కర్ నగర్ లో గల శ్రీరామ మందిరాన్ని...