31.7 C
Hyderabad

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దౌర్ సాయిలు, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు క్లిక్ రవి, బొట్టే గజేందర్, శేఖర్, నీరేడి సాయిలు, ఆర్. పోచయ్య, సాయి కిరణ్, పున్న పురుగయ్య, శంగిరి వీరన్న, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article