రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులు ఎముల లత – కృష్ణ, నీరడి శంకర్ లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సోమవారం తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీమ్ రావు, స్థానిక మండల నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున మంజూరు చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామపంచాయతీ సెక్రటరీ గంగాధర్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, షేక్ నిస్సార్, పత్తి లక్ష్మణ్, పార్వతి ప్రవీణ్, పార్వతి ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
