34.6 C
Hyderabad

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్ల సెంట్రల్ కమిటీ ఎన్నిక

Telangana Prohibition and Excise Department Head Constables Central Committee Election

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుళ్లు & కానిస్టేబుళ్ల సెంట్రల్ కమిటీ (రాష్ట్ర స్థాయి) నూతన కార్యవర్గ ఎన్నికల అనంతరం, నూతన కార్యవర్గ సభ్యులు అధికారికంగా నాంపల్లి లోని అబ్కారీ భవన్‌లో గురువారం తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షులుగా ఈర్ల రవి కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. ముఖేష్, కోశాధికారిగా డి. వీరాస్వామి లు ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుందని నూతన కార్యవర్గం ప్రకటించింది. అనంతరం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ చెవ్వురు హరికిరణ్, అడిషనల్ కమిషనర్ ఖురేషి, అడిషనల్ కమిషనర్  సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్ మల్కాజిగిరి ప్రణవి,అసిస్టెంట్ కమిషనర్ (హెడ్ క్వార్టర్స్) శీలం శ్రీనివాసరావు, అసిస్టెంట్ సెక్రటరీ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసారు.

More articles

Latest article