34.6 C
Hyderabad

నూతన సీఐ చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన ఆలూర్ పాలకవర్గం

Alur governing body meets new CI Chandrashekhar Reddy.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నూతన సీఐకి ఆలూర్ పాలకవర్గం ఘన సత్కారం

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఆర్మూర్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొండి చంద్రశేఖర్ రెడ్డిని ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసుల సహకారం అందించాలని పాలకవర్గ సభ్యులు కోరారు.ఈ సందర్బంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎస్ఐ రజినీకాంత్, ఏఎస్ఐ సుశీల్ కుమార్, వార్డ్ సభ్యులు సంజీవ్, రంజిత్, రాము,  మహేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article