నిర్మల్, బతుకమ్మ :
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12,000 లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
