25.4 C
Hyderabad

ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్  

BJP District President Dinesh inspected the withering paddy crops

Must read

📰 Generate e-Paper Clip

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను ఇందూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇతర ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారని, రైతుల పంటలను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకునేందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దినేష్ కుమార్ విమర్శించారు. రూరల్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందిస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్, సాగునీటి సౌకర్యాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో ఈ ప్రాంతంలో కురిసిన రాళ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే కళ్లుతెరిచి రైతులను ఆదుకోవాలని, పంట నష్టాన్ని అధికారులతో సమగ్రంగా అంచనా వేయించి నష్టపోయిన ప్రతి రైతుకు రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.తక్షణమే విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించకపోతే రైతులను పెద్ద ఎత్తున సమీకరించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని దినేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గంగారెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు జిల్లా వెల్మ గంగారెడ్డి, ఓంసింగ్, దేశపతి శీను, గణేష్, ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, నవీన్, కమలాపూర్ సర్పంచ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article