రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణం వద్ద స్విట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 న వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి స్వాతంత్రం తెచ్చారన్నారు. ఎంతోమంది మహనీయుల కలను సహకారం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, యువ మోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఈరోళ్ల గంగాధర్, బీవీ గుప్తా, చీదురా మహిపాల్ సేటు, పార్వతి మురళి, మహిల మోర్చా అధ్యక్షులు నాగరాజ కుమారి, కటిక రామరాజు, మహేందర్, జీలకర్ర విజయ్, పోశెట్టి, కృష్ణం రాజు, భోజగొండ అనిల్, గుడిసె ప్రభాకర్, బిజెపి మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
