29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణను రెడ్డి, వెలమలే పాలిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

  • ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమ భూస్వాములు జేఏసీ గా ఏర్పడి బీసీ ఎస్సీ, ఎస్టీ లను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారు.. దాన్ని ఆ రెడ్డి వెలమలే పాలిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ అన్నారు. తెలంగాణ లో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంగా జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీల రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ లో రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు అదే బీసీ, ఎస్సీ ఎస్టీ లు ఒక జేఏసీ గా ఏర్పడి, వచ్చిన తెలంగాణ రాష్ట్రం లో బీసీ ఎస్సి ఎస్టీ ల రాజ్యం కోసం ఈ జేఏసీ పని చేస్తుందని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ది బీసీ వాదం కాదు బీసీ జూదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిల్లీ కి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలి అని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ, 42% బీసీ రిజర్వేషన్ల ను 9వ షెడ్యూల్ లో పెట్టి పార్లమెంట్ లో చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సభ లో ప్రొఫెసర్ డా.కుమారస్వామి, దాసోజు లలిత, వివిధ కులాల ప్రతినిధులు 60 కులసంఘాలు, జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు వినోద్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజ్, సుమన్, ప్రేమ్ కుమార్, మహిపాల్, ఆత్మ గౌరవ్ స్థానిక నాయకులు మంజుల యాదవ్, రామా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాస రాజేశ్వర్, బుస్సా శంకర్, సాగర్ చారి, మహిపాల్ యాదవ్, దేగాం యాదా గౌడ్, షేక్ హుస్సేన్, శ్రీనివాసా చారి, నాగేష్ గంగపుత్ర, రేఖ రజక, డా.కేశవులు, రాజేందర్ సింగ్, లింగుస్వామి గోసంగి, రమేష్ రజక తదితరులు పాల్గొన్నారు.

Telangana is being ruled by Reddy and Velamale

More articles

Latest article