. . . బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ మైనార్టీ నాయకులు నవీబ్ ఇక్బాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీలకు మొండి చేయి చూపించారని, రూ. 4000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ మైనార్టీ నాయకులు నవీబ్ ఇక్బాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీబ్ ఇక్బాల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి తోఫా అందించడం జరిగిందని, ప్రస్తుత నేపథ్యంలో మైనార్టీలను పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. నిధులను వృధా చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ షెహజాద్, మహ్మద్ మతీన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లా ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమి, అబ్దుల్ అజీజ్, మజర్ ఉద్దీన్, తజ్జముల్ ఖాన్, మహ్మద్ హఫీజ్, నయీబ్ ఖురేషి, మహ్మద్ ఇమ్త్యాజ్, యూనిస్, మహ్మద్ ఆరిఫ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
