24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఆలయ నిర్మాణానికి స్థలం విరాళం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని 28వ వార్డులో కట్ట పోచమ్మ (వేయి కళ్ల పోచమ్మ) ఆలయ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అజయ్ వడియార్ దేశాయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఆయన విరాళంగా అందించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారీ, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్, కోశాధికారి గమరపేలేట శ్రీను, కమిటీ సభ్యులు అజయ్ వడియార్ దేశాయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోశెట్టి, సంగ్రామ్, కట్ట మీద గంగారాం, శేఖర్, అజయ్, ప్రవీణ్, భాస్కర్, వీడీసీ సభ్యులు, కాలనీవాసులు, పెద్దలు పాల్గొన్నారు.

 

 

Donation of land for the construction of a temple

More articles

Latest article