30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంతవరకు పోరాడుదాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భగత్ సింగ్ వర్థంతి మహా సభల గోడ ప్రతుల ఆవిష్కరణ లో పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు, చదువుకున్న 25 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాడాదామని పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆద్వర్యంలో ఆదివారం షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వతంత్ర సమర చరిత్రలో వలసవాద విముక్తి ఎన్నో గొప్ప పోరాటాలు జరిగాయన్నారు. వారి స్పూర్తితో మనం కూడా పోరాడాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మార్షల్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, పీడీఎస్ యూ ఆర్మూర్ అధ్యక్షుడు డి.నిఖిల్,  పీవైఎల్ నాయకులు కళ్యాణ్, రిషి, సిద్ధార్థ్, ప్రభాస్, రాజేష్, విష్ణు, ఈశ్వర్, దయాల్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article