24 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2025 నూతన సంవత్సర డైరీని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర సంఘ అధ్యక్షురాలు డా.జి నిర్మలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర డైరీ లోని సమాచారాన్ని పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పీ ఆర్ సీ , పాత పెన్షన్ అమలు , బకాయి ఉన్న డీ ఏ ల విడుదల తదితర పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని కోరారు.  అందుకు ముఖ్యమంత్రి తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలోగా పెన్షనర్ల బిల్లులు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ప్రజల కొరకు పని చేయాలని అవినీతి రహితంగా పని చేయాలని కోరారు.  ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యోగ సంఘాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ముందుకెళ్తామని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ప్రత్యక్ష ప్రాతినిథ్యం చాలా అవసరమన్నారు. అప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారం సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ చిలగాని సంపత్ కుమార్ స్వామి, వైస్ చైర్మన్ గడ్డం బాలస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, జాజుల రంజిత్ ప్రధాన కార్యదర్శి,  కోశాధికారి ఆనంద్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏజే సుగంధిని, సిహెచ్ రేణుకా దేవి ఉమెన్ కన్వీనర్ , వాస సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రామరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం కె రాజు, శంకర్, గ్రేటర్ అధ్యక్షులు కొంకటి మల్లేష్, గౌతమ్ తత్వానంద చారీ తదితరులు పాల్గొన్నారు.

Telangana Employees Association Diary Launched

More articles

Latest article